Posts

Showing posts from August, 2021

ముందుమాట

తెలుగుభాషలో శతక ప్రక్రియ విశిష్టమైనది. ఒక ఛందోవిశేషం తీసుకొని అన్ని పద్యాలూ వ్రాయాలి. వాటి సంఖ్య ఒక వంద కావాలి. ఆ పద్యాలన్నింటికీ ఒకే విధమైన ముగింపు ఉండాలి. ఆ ముగింపు ఒక పదం కావచ్చును - ఏదో కేశవా అనో కృష్ణా అనో‌ శివా అనో ఉండవచ్చును. లేదా ఒక పదబంధం కావచ్చును శ్రీగిరి మల్లికార్జునా అన్నట్లుగా, దాశరథీ‌ కరుణాపయోనిధీ అన్నట్లుగా. ఒక్కొక్క సారి ఆ ముగింపు ఏకంగా ఒక పాదం అంతా పరచుకొని ఉండవచ్చును హతవిమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ అన్నట్లుగా. అరుదుగా ఒక పాదం కన్నా హెచ్చుగానే ఉండవచ్చును కూడా భావనారాయణ భక్తపోషణ మదాత్మవిలక్షణ రక్షణేక్షణా అన్నట్లుగా. ఇలా వందో అంతకు మిక్కిలిగానో పద్యాలు వ్రాసి ఒక కృతిని నిర్మిస్తే అది ఒక శతకం అనిపించుకుంటుంది. మరలా ఈశతకాలు రకరకాలు. ముప్పాతికమువ్వీశం శతకాలు భక్తిపూర్వకమైన రచనలు. మిగిలిన వాటిలో అధికభాగం నీతిబోధలు.  నిజానికి ఇప్పటికి కొన్ని వందల సంవత్సరాలుగా శతకాలు వస్తునే ఉన్నా, ఇప్పటికీ‌ మన తెలుగుకవులకు శతక నిర్మాణం మీద మక్కువ యేమీ తగ్గలేదు. సరికదా ఇటీవల మరింత హెచ్చింది అనిపిస్తున్నది. విచారించవలసిన విషయం ఏమిటంటే రానురాను శతకాల లోని భాష, భావశబలత, సుబోధకత అన్న ముఖ్యమైన మూడు

అగస్త్యలింగశతకము

అందమైన ఈ‌ అగస్త్యలింగశతక కర్త తాడికొండ పూర్ణమల్లికార్జున అయ్యవార్లం గారు అని నాకు లభించిన 1935వ సంవత్సరంలో బెజవాడలో ముద్రించబడిన ప్రతిముఖపత్రం విదితం చేస్తోంది. ఇది ఒక శివపరమైన రమ్యమైన సీసపద్య శతకం. శతకం అన్నాక ఒక మకుటం ఉండాలి కదా. ఈ‌శతకంలో ఒకటికంటే ఎక్కువే మకుటాలు కనిపించటం అనేది ఒక విశేషం. ఐనా శతకపద్యాలలోని ఎత్తుగీతి చివరి పాదంలో ఈమని అగస్త్యలింగ అన్న సంబోధన మాత్రం తప్పకుండా ఉంది. కాబట్టి ఆ ఒక్క ముక్కనే మనం‌ మకుటంగా గ్రహించాలి. విస్తరించి చూసిన పక్షంలో మనకు కనిపించే మకుటాలు     ఈమని యగస్త్యలింగ బాలేందుసంగ     ఈమని యగస్త్యలింగ పుష్పేషుభంగ     కలుషచయభంగ యీమనగస్త్యలింగ కవి గారి యింటి పేరు తాడికొండ. ఈ తాడికొండ గుంటూరు జిల్లాలో ఉంది. కవి గారు తెనాలి దగ్గర ఉన్న ఈమని గ్రామంలో శా.శక 1776వ (క్రీ.శ 1855) సంవత్సరంలో జన్మించారు. వీరు భారద్వాజగోత్రీకులైన బ్రాహ్మణులు, శైవులు. దినదినమూ 21600 నామజపం చేసే షట్కాల శివపూజా దురంధరులైన ఈ కవి గారు సంస్కృతాంధ్రభాషల్లో మంచి పాండిత్యంతో పాటుగా సంగీతశాస్త్ర మంత్రశాస్త్రాల్లో కూడా మంచి ప్రతిభ కలవారు. ఈ‌ శతకప్రతిలో చివరన కవి గారు రచించిన శివకీర్తనలు కూడా ఉన్నాయి