ప్రత్యక్షరామచంద్రశతకము
ఈ ప్రత్యక్షరామచంద్రశతక కర్త గారి పేరు గొట్టిముక్కల కోటయ్య గారు. శతకంలోని 106వ పద్యంలో ఆయన విలసిత గొట్టుముక్కల కోటయాఖ్యుడన్ రచియించితి శతక రాజమరయ అని చెప్పుకున్నారు. ఈ కవివర్యులు నివసించిన స్థలకాలాదుల వివరాలు తెలియవు. ఈశతకం 1943లో అచ్చయినదని మాత్రం పరోక్షంగా తెలుస్తున్నది. దొరకిన ప్రతిలో వివరం లేదు. ఇది ఒక సీసపద్య శతకం. ఈ శతకం మకుటం భక్తవత్సల భాసురభద్రశైల ధామ కృపసాంద్ర ప్రత్యక్షరామచంద్ర అని ఉండటం వలన ఈశతకంలోని పద్యాలన్నింటికీ ఎత్తుగీతిగా తేటగీతి మాత్రమే ఉండటం నియతం అవుతున్నది. ఈశతకంలోని పద్యాలు ద్రాక్షాపాకంలో ఉండి చక్కటి ధారాశుధ్ధితో ఉన్నాయి. అన్నీ రసరమ్యంగా ఉన్నాయి. కవిగారు శతకం మొదలు పెడుతూనే సీ॥ అవధరింపు దశర ♦ థాత్మజ నీమీద సీసశతకము ర ♦ చింతు నేను ఆంధ్రసంస్కృతనిఘం ♦ ట్వాది కావ్యము లైనఁ జదివి యెఱుంగని ♦ జడుఁడ గాన ఛందస్సులందున ♦ సద్యుక్తగణయతి ప్రాసలక్షణశబ్ద♦ దోషములను లేశమాత్రంబైన ♦ దేశికుని వలన మొదలె నేరనియట్టి ♦ మూఢమతిని తే.గీ॥ బహువిధంబుల మరువక ♦ భక్తి చేత సంతసంబున నీనామ ♦ స్మరణ జేతు భక్తవత్సల భాసుర ♦ భద్రశైల ధామ కృపసాంద్ర ప్రత్యక్ష ♦ రామచంద్ర దొరకిన ప్రతి ముద్రణ కూడా